సిక్స్‌ప్యాక్‌ చేసిన ఆఖరివాణ్ని నేనే ఏమో అంటున్న కళ్యాణ్ రాం???

సిక్స్‌ప్యాక్‌ చేసిన ఆఖరివాణ్ని నేనే ఏమో అంటున్న కళ్యాణ్ రాం???


ఏ ప్రయత్నానికైనా అంతిమ లక్ష్యం విజయమే. అయితే గమ్యం కంటే ఆ ప్రయాణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు అరుదుగా కనిపిస్తారు. కల్యాణ్‌రామ్‌ అలాంటి కథానాయకుడే. ఓ కథని కథగా నమ్మి నూటికి నూరుశాతం అంకితభావంతో పనిచేయడమే తనకిష్టమని చెబుతుంటారాయన. ఆయన సినిమాల ఫలితాన్ని పక్కన పెడితే అందుకోసం పడిన కష్టమే ఎక్కువ కనిపిస్తుంటుంది. దానికి విజయం తోడైతే ఎలా ఉంటుందో ‘పటాస్‌’తో తెలిసింది. ఆ జోరుతో తెరకెక్కిన మరో చిత్రం ‘ఇజం’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సంధర్భం గా కళ్యాణ్రాం గారు కొన్ని విషయాలు చెప్పారు అవేంటో మీ కోసం కూడా.... 

ఈ సినిమాలో నేను పాత్రికేయుడిగా నటిస్తున్నా. నాపై నేనే ఎందుకు సెటైర్లు వేసుకొంటా (నవ్వుతూ). ఆ మాటకొస్తే జర్నలిజానికి ఓ కొత్త అర్థాన్ని ఇచ్చే చిత్రమిది. కలం శక్తి ఏంటో మరో స్థాయిలో చూపిస్తున్నాం. నా వరకు ఏ విషయాన్నీ వ్యతిరేక కోణంలో చూడడం ఇష్టం ఉండదు. నాణేనికి రెండు వైపులున్నట్టు.. ప్రతి రంగంలోనూ మంచి, చెడు ఉంటాయి. 

ఇజం’ కోసం సన్నబడాల్సిందే అని పూరి సార్‌ ముందే చెప్పారు. అందుకే మూడునెలల పాటు కష్టపడి సిక్స్‌ప్యాక్‌ చేశాను. దాదాపు పది కిలోలు తగ్గా. చేపలంటే నాకు బొత్తిగా ఇష్టం ఉండదు. అయినా మూడు పూటలూ అదే తినాల్సి వచ్చింది. సిక్స్‌ప్యాక్‌ అనేది ఈరోజుల్లో పెద్ద వింతేం కాదు. అందరు హీరోలూ చేసేశారు. బహుశా సిక్స్‌ప్యాక్‌ చేసిన ఆఖరి హీరో నేనే అవుతానేమో?

మీ సినిమాల గురించీ, చేయబోయే కథల గురించీ ఎన్టీఆర్‌తో చర్చిస్తుంటారా? అని కళ్యాన్ రాం ని అడిగినప్పు ఇలా  చెప్పాడు?


తరచుగా. మా మధ్య ఇలాంటి విషయాలే నడుస్తుంటాయి. ‘ఇజం’ టీజర్‌ని నాకంటే ముందు తనే చూశాడు.


Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.