ఎన్టీయార్ నా దేవుడు ఆయన్ను చూసి దణ్ణం పెట్టాలంతే !!! మన జూనియర్ తో త్వరలో సినిమా వుంటుంది...
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఈ ప్రోగ్రాం గురించి అందరికి తెలిసిందే..రీసెంట్ గా మన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పాల్గొన్నారు..
ఆ ప్రోగ్రాం లో మన విశ్వ విఖ్యాత నటుడు ఎన్టీయార్ గురించి ఏమన్నారో తెలుసా !!
మీరు దర్శకులుగా ఇండస్ట్రీ లోకి వచ్చిన మూడేళ్లకే మీకెందుకు ఎన్టీయార్ గారు అవకాశం ఇచ్చారు? అని ఆర్కే అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు...
రాఘవేంద్రరావు : ఆ విషయం లో నేను చాలా ఆశ్చర్యపోయాను . నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణగారు నా ప్రతిభను గమనించారేమో. నేను ‘జ్యోతి’ చిత్రం చేసే సమయంలో వారెళ్లి ‘రాఘవేంద్రరావు దర్శకుడిగా సినిమా చేస్తాం’ అని ఎన్టీయార్‌ను అడిగారట. ‘దర్శకుడు ప్రకాష్ రావు గారు కొడుకే కదా.. కథను రెడీ చేసుకోమని చెప్పండి’ అని ఎన్టీయార్ అన్నారని వారొచ్చి నాకు చెప్పారు. నేను నమ్మలేదు. ఆ మాటకొస్తే ఎన్టీయార్ గారితో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ‘పాండవవనవాసం’ చిత్రంకు అసిస్టెంట్ దర్శకుడిగా రామారావుగారి మీదే క్లాప్ కొట్టాను. ఎన్టీయార్ గారి చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’ నేను చేశాను. ఎన్టీయార్ గారిని చూసి దణ్ణం పెట్టాలంతే. ఆయన నాకు దేవుడు. ఇవాళ ఈ జీవితం ఇచ్చాడంటే ఆయన చలవే. ఆయనకు సబ్జెక్ట్ బాగా తెలుసు. ఆయన గొప్ప విద్యార్థి. ఆయన మేం చెప్పే విషయాన్ని బాగా అబ్జెర్వ్ చేసేవారు. చెప్పిన దాన్ని బాగా విని టూ హండ్రడ్ పర్సెంట్ బాగా చేసేవారు. ఓసారి సినిమా పోయాక ఆయన ఇంటికి నేను ఇబ్బందిగా వెళితే ‘ఇట్స్ ఆల్రైట్ బ్రదర్.. మనం తప్పును తెలుసుకున్నాం’ అన్నారు ఎన్టీయార్. మనం అనే భావన గొప్పగా అనిపించింది.
ఆయన మనవడు తాతకు తగ్గ సినీ వారసుడు మన తారక్ తో కూడా సినిమా చెయ్యటానికి కథలు సిద్ధం చేస్తున్నాం . వీలైనంత త్వరగా ఆ ప్రోజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ వుంటుంది....ఈ సినిమాలొ కొత్త తారక్ ని చూస్తారు....

0 comments:
Post a Comment