చాలా మంది జుట్టు రాలే సమష్య తో బాధ పడుతుంటారు ..ఇవి పాటించండి వీలైనంత త్వరగా ఆ సమస్య నుంచి దూరం కావచ్చు

చాలా మంది జుట్టు రాలే సమష్య తో బాధ పడుతుంటారు ..ఇవి పాటించండి వీలైనంత త్వరగా ఆ సమస్య నుంచి దూరం కావచ్చు....



చాలా మంది తల వెంట్రుకలు రాలే సమస్యతో బాధ పడుతుంటారు . వెంట్రుకలు రాలటం వల్ల మగవారు మరియు ఆడవారూ ఎంతో బాదకు లోనవుతునారు . ఈ రోజుల్లో ఈ సమస్య చాలా సర్వ సాధారణం  అయిపోయింది. ఈ సమస్య తో బాధపదేవారు చాలా రకాలైన చికిత్సలు తీసుకుంటూ వుంటారు .. తీరా ఈ సమస్య తీరుతుందా అంటే చాలా మందికి తీరదు . 

ఈ సమస్యల నుంచి దూరం కావాలంటే ఇవి పాటించండి.....


ఉల్లి

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అన్న సామెత ముమ్మాటికీ నిజం. మనకు కిచెన్లోనే కాక ఎన్నో చోట్ల ఉపయోగపడుతుంది. అలాగే మీకు జుట్టు బాగా ఊడిపోతోందని బాధపడుతుంటే ఉల్లి ఆ సమస్యని పరిష్కరిస్తుంది. ఉల్లిపాయల్ని తీసుకుని గుజ్జుగా గ్రైండ్ చేసుకుని మీ స్చాల్ప్ కి కుదుళ్ళకి పెట్టుకుని కాసేపాగిన తర్వాత కడుగుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది. ఎందుకంటే ఉల్లి స్కాల్ప్లోని రక్తప్రసరనను సరి చేస్తుంది.


వేడినూనెతో  డైలీ మస్సాజ్ చేసుకోవటం


వేడినూనె తో తలకు మస్సాజ్ చేసుకుంటే రక్తప్రసరణ పెరుగుతుంది. న్యూట్రీషన్ లోపం సమస్య వల్ల జుట్టు రాలుతుంది. మోస్తరు వేడి నూనే తీసుకుని కొన్ని నిముషాలు అలా మర్ధనా చేసుకుంటే రక్త ప్రసరణే కాదు, కురులు చాలా గట్టిపడతాయి. అంతేకాదు మీరు ఆయిల్ వాడటం వల్ల దానిలో ఉన్న విటమిన్-ఇ స్కాల్ప్ పై బాగా పని చేస్తుంది. కొబ్బరి నూనె, ఆల్మండ్, మస్టర్డ్ లాంటి నూనెలు మంచి ఫలితాన్నిస్తాయి. 

మెంతులు

మెంతులు ప్రతీ ఇంటిలో ఉండేవే. కానీ వీటి గొప్పదనం ఎంతో ఉంది. వీటిలో హార్మోన్ యాంటీయాసిడెంట్లు ఉండటమే కాక నికోటినిచ్ ఆసిడ్ ఉండటం వల్ల వెంట్రుకలు ఊడకుండా చేయటమే కాక కుదుళ్ళు గట్టిపడేలా చెసి వెంట్రుకలు రాలకుండా చేయటమేకాక మల్లి జుట్టు మొలిచేలా కూడా చేస్తుంది.
ఇప్పుడు ఇన్ని గుణాలు ఇందులో ఉన్నాయని తెలిసి మీలో దీనిని ఎలా ఉపయోగించాలా అన్న ఉత్సుకత పెరిగే ఉంటుంది. సరే ఇక మెంతుల్ని తీసుకుని వాటిని నీటిలో రాత్రి అంతా నానపెట్టాలి. పొద్దున్నే వాటిని గ్రిండ్ చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని స్కాల్ప్ కు కుడుళ్ళవరకూ పట్టించాలి. తరువాత 30 నిముషాలు ఉంచుకోవాలి. తర్వాత నీటితో కడుగుకోవాలి. దీనికి షాంపూ అవసరం లేదు. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ఆ ఫలితాలు మీరు చూడవచ్చు.

అలోవేర

అలోవెరా కూడా ప్రతి ఇంటిలో ఉండే మొక్కే. కానీ దీనిని ఎలా ఉపయోగించాలో చాలా మందికి తెలియదు. ఈ రోజుల్లో జుట్టు రాలటం అనేది సర్వసాధారణమైన విషయమైపోయింది. ఎంచేతంటే కాలుష్యం వల్ల ఇలా జరుగుతోంది.అలోవేరా జుట్టు సమస్య నుంచీ కాపాడటమే కాక మల్లి జుట్టు పునరభివృధ్ధికి ఎంతో మంచిది. అలోవేరా వాడటం వల్ల ఊడటం తగ్గించటమే కాక దురద లంటి వాటినుంచీ బయటపడేస్తుంది. 




పెరుగు

పెరుగు కూడా జుట్టు రాలటం సమస్యను తగ్గిస్తుంది. తలపై పెరుగు చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు మృదువుగా జీవంగా కనిపించేలా చేస్తుంది. రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ఒక టేబుల్ స్పూన్ తేనె మిశ్రమంగా చేసి స్కాల్ప్ కి పెట్ట్టుకుంటే మంచి ఫలితాలుంటాయి.


మందార పువ్వు

మందార పువ్వు ప్రతీ ఇంట్లో ఉండేదే అయితే మందార ఆకు మందారపువ్వు చాలా బాగ జుట్టు రాలే సమస్యని దూరం చేస్తుంది. అంతేకాక పునర్వృధ్ధికి దోహదం చేస్తుంది. మందార పువ్వు జుట్టు చిట్లతాన్ని కూడా దూరం చేస్తుంది. మందార పువ్వుల్ని 12-13 తీసుకుని కొబ్బరి నూనెతో కలిపి వేడి చేసుకోవాలి. తర్వాత వడగట్టి దానిలో నుంచీ నూనె సారాన్ని తీయాలి. తర్వాత స్కాల్ప్కి అలాగే వెంట్రుకలకి పట్టించాలి. ఒక గంట ఉంచుకుని కడిగేయాలి.

బీట్రూట్

బీట్రూట్ జ్యూస్ జుట్టు రాలే సమస్యని దూరం చేస్తుంది. బీట్రూట్ జ్యూస్ లో ప్రోటీన్లు,కాల్షియం , పొటాషియం, కార్బో హైడ్రేడ్లు , విటమిన్-బీ ఉంటాయి. అందువల్ల బీట్రూట్ జ్యూస్ చాలా బాగా పని చేస్తుంది. రోజూ మీ ఆహారంతో పాటు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల మీ జుట్టే కాడు సరీరం పై కూడా ఎన్నో విధాలుగా పని చేస్తుంది.


గుడ్డు

గుడ్డు లో ని తెల్ల సొన జుట్టు రాలే సమస్య నుంచి బయటపడేస్తుంది.తెల్ల సొనను తీసుకుని పేస్ట్లా చేసి తర్వాత తలకు రాసుకోవాలి. ఇలా అరగంటా లేదా గంట ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.




ఇది కనుకా మీకు నచ్చ్చినట్లైటె షేర్ చెయ్యండి....

Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.