ఎన్టీఆర్ పై తప్పుడు ప్రచారం?? ఇంకా క్లారిటీ రాలేదు.......
ఎన్టీయార్ జనతాగ్యారేజ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత ఇప్పటి వరకు తన తదుపరి సినిమాను ప్రకటించలేదు. అయితే తారక్ సినిమా సినిమాకు ఓ కొత్త లుక్‌ను ప్రెజెంట్ చేస్తూ అభిమానులతో పాటు సినీ ప్రేమికులను అలరిస్తున్నాడు . ఇటీవల వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఎన్టీయార్ గెటప్‌కు అయితే మంచి ఆదరణ వచ్చింది. అయితే ఇప్పుడు ఎన్టీయార్ న్యూ లుక్ అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
ఓ పద్ధతి లేకుండా పెరిగిన గెడ్డం, దువ్వని క్రాఫ్‌తో ఆ ఫోటోలో ఎన్టీయార్ ఉన్నాడు. ఆ ఫోటో గురించే ఎన్టీయార్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. రాబోయే కొత్త సినిమాలో కొన్ని సీన్లలో ఎన్టీయార్ ఈ గెటప్‌లో కనబడనున్నాడు అంటూ ప్రచారం చేస్తున్నారు.
అయితే అందరూ అనుకుంటున్నట్టు ఈ ఫోటో ఇప్పటిది కాదు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు ముందుది. ఆ సినిమా కోసం గెడ్డం పెంచుతున్న సమయంలో ఇలా ఉన్నాడన్నమాట ఎన్టీయార్. నిజానికి ‘జనతాగ్యారేజ్’ తర్వాత ఇప్పటివరకు తన కొత్త సినిమా విషయంలో ఎన్టీయార్‌కే క్లారిటీ లేదు. అలాంటిది కొత్త గెటప్ కోసం ఎలా ప్రిపేర్ అవుతాడు. కాబట్టి ఎన్టీయార్ కొత్త గెటప్ అంటూ జరుగుతున్న ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం.
సో ఫ్యాన్స్ మరి కొద్ది రోజులు వేచి వుండాల్సిందే .....అఫీషియల్ వివరాలు వచ్చే వరకూ....
0 comments:
Post a Comment