మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి...కష్టమే ఈ కథనం పై మీరూ ఓ లుక్కెయ్యండి..



మరి వీళ్ళందరి  పరిస్థితి ఏంటి...కష్టమే ఈ కథనం పై మీరూ ఓ లుక్కెయ్యండి..  






మన టాలీవుడ్ అనే కాదు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా బలంగా ఏలేది స్టార్ హీరోలే..అంటే వాళ్ళ సినిమా ఫ్లాఫ్ అయినా హిట్ అయినా కనీస కలక్షన్లకు ఢోకా ఏమి లేదు....రెమ్యునరేషన్ విషయం లో కూడా పెద్ద ప్రోబ్లెం లేదు...ఆ రేంజ్ మరి స్టార్ హీరోలది..అయితే ఇక్కడ ఈ టాపిల్ గురించి ఎందుకు మాట్లాడుకోవలసి వస్తుందంటే బడా బడా హీరోలు గట్టిగానే సంపాదించారు..చెప్పాలంటే వందల కోట్లలో ఇంకా చెప్పలంటే వేల కోట్లలో కూడా మన సినీ ప్రముఖుల దగ్గర వున్నాయి..బయటకి విషయం రాక పోయినా చాలా అంటే చాలా మంది బ్లాక్ మనీ మెయింటైన్ చేస్తున్నారు..


  ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే  నిన్ననే మోదీ ప్రభుత్వం నల్లధనం నిరోధానికి కఠిన చర్యలు చేపట్టింది. మంగళవారం అర్థరాత్రి నుంచి రూ.500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. డిసెంబరు 30లోగా రూ.500, రూ.1000నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 11 వరకు వైద్యసేవలు, రైలు టికెట్ల కోసం రూ.500, రూ.1000 నోట్లు వినియోగించుకోవచ్చని ప్రధాని వెల్లడించారు. 


దిల్లీ నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. డిసెంబరు 30లోపు డిపాజిట్‌ చేయనివారు.. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్‌ చేయవచ్చని తెలిపారు. రేపు బ్యాంకుల్లో వినియోగదారుల సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రేపు, ఎల్లుండి ఏటీఎంలు కూడా పనిచేయవని పేర్కొన్నారు.



 అయితే ఈ విషయం విని సినీ ప్రముఖులంతా తలలు పట్టుకున్నారని...ఏం చెయ్యాలో అర్థం  కాని  పరిస్థితి లో వున్నారంటా...
Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.