మోహన్ లాల్ అనుకున్నంతగా ఏమీ చెయ్యలేదు..లేక పోతే తారక్ రేంజ్ ఇంకోలా వుండేదీ...అసలు మ్యాటర్ ఏంటి.....

మోహన్ లాల్ అనుకునంతంగా ఏమీ చెయ్యలేదు..లేక పోతే తారక్ రేంజ్ ఇంకోలా వుండేదీ...అసలు మ్యాటర్ ఏంటి.....




పక్క ఇండస్ట్రీ చిత్రాలు తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. అక్కడి హీరోలను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. రజనీకాంత్, కమల్‌హాసన్, సూర్య వంటి నటులకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. 

    ఇప్పుడు మన టాలీవుడ్ హీరోలు కూడా పక్క మార్కెట్ల వైపు చూస్తున్నారు .. అక్కడ కూడా తమ క్రేజ్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రీసెంట్ ఇండస్ట్రీ హిట్  సినిమా జనతాగ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ కూడా మాలీవుడ్‌లో తన ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నించాడు.  కానీ, తారక్ అనుకున్నంతగా అది నెరవేరలేదు ఓ మోస్తరుగా నిలిచింది .

        అయితే ఇక్కడ ప్రోబ్లం ఏంటి అంటే  ఈ సినిమాలో తారక్‌తో పాటు కీలక పాత్రలో నటించిన మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఆ సినిమాకు తగినంత ప్రచారం కల్పించడంలో విఫలమయ్యాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు అనుకుంటున్నాయి. జనతాగ్యారేజ్ కోసం మలయాళ రైట్స్ మొత్తాన్ని తానే తీసుకున్న మోహన్‌లాల్.. భారీ మొత్తానికి సినిమాను అమ్ముకున్నాడు. అయితే.. అక్కడ సినిమా ప్రమోషన్ కోసం ఆడియో వేడుక కాదు కదా.. కనీసం చిన్న చిన్న ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించలేదని చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్, చిత్ర సిబ్బందితో కలిసి ఒక్క ప్రెస్ మీట్‌నైనా ఏర్పాటు చేయలేదని, మంచి రేటుకే సినిమాను అమ్ముకున్నా అక్కడ ఎక్కువ థియేటర్లలో విడుదల చేయలేకపోయాడని అనుకుంటున్నారు.

       ఒక్కమాటలో చెప్పాలంటే తారక్‌ మాలీవుడ్ లో ఫెయిల్ అవ్వటానికి మోహన్‌లాలే కారణమంటు విమర్శిస్తున్నారు. 


Share on Google Plus

About Tirupatirao

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Powered by Blogger.